కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ఆంక్షలు విధిస్తున్న బ్రిటన్

కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ఆంక్షలు విధిస్తున్న బ్రిటన్

దక్షిణాఫ్రికాలో నమోదైన కొత్త వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆరు ఆఫ్రికన్ కంట్రీస్ కు విమాన రాకపోకలను బ్రిటన్ నిషేధించింది. నమీబియా, లెసోతో, ఎస్వాటిని, జింబాబ్వే, బోట్స్ వానాలను యూకే రెడ్ లిస్ట్ లో పెట్టింది. తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఆఫ్రికాలో నమోదైన B.1.1529 వేరియంట్ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.