ఈ అమ్మాయి దగ్గర మనుషుల ఎముకలతో తయారైన 46 కేజీల డ్రగ్ దొరికింది..!

ఈ అమ్మాయి దగ్గర మనుషుల ఎముకలతో తయారైన 46 కేజీల డ్రగ్ దొరికింది..!

యూకేకు చెందిన ఆ యువతి వయసు 21 సంవత్సరాలు. ఫ్లైట్ అటెండెంట్గా కూడా పనిచేసింది. శ్రీలంకలో ఆ యువతిని అరెస్ట్ చేశారు. మనుషుల ఎముకల నుంచి తయారుచేసిన 46 కిలోల డ్రగ్ను స్మగ్లింగ్ చేస్తూ ఆమె పట్టుబడింది. ఆ డ్రగ్ చాలా పవర్ ఫుల్. ఒక డెడ్లీ సింథటిక్ డ్రగ్. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ లండన్కు చెందిన చార్లెట్ మే లీ అనే యువతికి 46 కేజీల డ్రగ్ను స్మగ్లింగ్ చేసినందుకు 25 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ డ్రగ్ పేరు ‘కుష్’.

ఈ డ్రగ్ తయారీలో కొంత శాతం మనుషుల ఎముకల పొడిని కూడా వాడతారు. కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సదరు యువతి ఈ మాదక ద్రవ్యాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. చార్లెట్ థాయ్ లాండ్ లో పనిచేసేది. అక్కడే డ్రగ్స్ గ్యాంగ్లతో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆమె వీసా ఎక్స్పైర్ అయింది. వీసా రీన్యూవల్ కోసం ఈలోపు శ్రీలంకకు షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసింది.

Also Read:-నీ భర్తపై మరో మహిళ ప్రభావం ఉన్నది..నాకు వశీకరణ తెలుసు.. సమస్య తీరుస్తా

ఈ డ్రగ్స్ గురించి తనకు ఏం తెలియదని, తన బ్యాగ్లో ఎవరో పెట్టారని ఆమె పోలీసులకు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ‘కుష్’ డ్రగ్ చాలా ప్రమాదకరం. ఈ డ్రగ్కు వెస్ట్ ఆఫ్రికాలో ఎక్కువ మంది టీనేజర్లు బానిసలయ్యారు. ఈ డ్రగ్ ఎక్కువగా తీసుకుని వెస్ట్ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ దేశంలో వారంలోనే 12 మందికి పైగా చనిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో కొత్త రకం డ్రగ్స్ పట్టుబడటం శ్రీలంక చరిత్రలోనే తొలిసారి. మే 12న చార్లెట్ ఈ 46 కేజీల డ్రగ్ తో దొరికిపోయింది. ‘కుష్’ డ్రగ్ తీసుకున్న యువత రోడ్డు మీద నడుచుకుంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు.