"ఉక్కు సత్యాగ్రహం" ఆడియో విడుదల

"ఉక్కు సత్యాగ్రహం" ఆడియో విడుదల

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమా “ఉక్కు సత్యాగ్రహం”. సత్యారెడ్డి ఈ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సుద్దాల అశోక్ తేజ రచించిన ఒ పాటను రిలీజ్ చేసింది. ఇవాళ హైదరాబాద్ లో ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకలో గద్దర్, ఆర్. నారాయణమూర్తి ముఖ్య అథితిలుగా పాల్గొన్నారు.

ఆర్ నారాయణమూర్తి

గద్దర్ రాసిన పాటలు ఒకటా రెండా.. ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించారని ఆర్ నారాయణమూర్తి అన్నారు. సినిమా గురించి మాట్లాడిన ఆయన.. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తుంటే.. దానిని ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం న్యాయమా.? అని ప్రశ్నిస్తూ సత్యారెడ్డి ఈ సినిమా తీశాడని తెలిపారు. కళాకారుడు ప్రశ్నించాలి.. అలా ప్రశ్నిస్తున్నాడు సత్యారెడ్డి అంటూ ఆడియో విడుదలకు హాజరైన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పార్టీలును ఉద్దేశిస్తూ ప్రైవేటీకరణ ఆపమంటూ విజ్ఞప్తి చేశారు. 

గద్దర్

ఈ వేడుకలో అనేక సామజిక అంశాలు ప్రసావించిన గద్దర్, ఆర్ నారాయణమూర్తితో ఉన్న అలనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ వంగపండును స్మరించుకున్నారు. సినిమా గురించి మాట్లాడిన ఆయన.. ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలు మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది అన్నారు. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలిపునిస్తున్నానని చెప్పారు. అందరు కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపగలరు అని నమ్ముతూ ముగిస్తున్నాను అన్నారు. 

చిత్రం : ఉక్కు సత్యాగ్రహం 
బ్యానర్ : జనం ఎంటర్ టైన్మెంట్స్ 
నటీనటులు : సత్య రెడ్డి, మేఘన  లోకేష్, ఎం వి.వి సత్య  నారాయణ, గద్దర్, అయోద్య రామ్
కథ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : పి.సత్య రెడ్డి 
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ కోటి 
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, గద్దర్ 
ఎడిటర్ : మేనగా శ్రీను 
సినిమాటోగ్రఫీ : చక్రి కనపర్తి 
కోరియోగ్రఫీ : నందు జన్న