ఉక్రెయిన్ ఎదురుదాడుల్లో రష్యా మేజర్ జనరల్ మృతి

ఉక్రెయిన్ ఎదురుదాడుల్లో రష్యా మేజర్ జనరల్ మృతి

ఖర్కీవ్: రష్యా బాంబు దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ విదేశాల నుంచి అందుతున్న ఆయుధాలను ఉపయోగించి ప్రతిదాడులకు దిగుతోంది. రష్యా దళాల ఆధిపత్యంలోకి వెళ్లిన కీవ్ నగర సమీపంలో  ఉక్రెయిన్ దళాలు రష్యా సేనలపై విరుచుకుపడ్డాయి. రష్యా దళాలపై ఊహించని రీతిలో ఉక్రెయిన్ దళాలు ప్రతిదాడులకు దిగాయి. ఎదురు కాల్పులు చూసి ఉలిక్కిపడ్డ రష్యా దళాలు తేరుకునేలోపే భారీ మూల్యం చెల్లించుకున్నాయి.

రష్యా 41వ ఆర్మీ బెటాలియన్ తో కాపు కాసిన డిప్యూటీ కమాండర్, మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ తోపాటు మరికొందరు సైనికులు చనిపోయారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడడంతో మిగిలిన సైనికులు వారిని ఉక్రెయిన్ దళాలకు దూరంగా వెనక్కు  తీసుకెళ్లిపోయారు. దాడిని ధృవీకరించిన ఉక్రెయిన్ సైన్యం.. రష్యా మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ చనిపోయాడని ప్రకటించింది.