రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు..
  • ఐరోపాలో వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం

ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. రాకెట్లు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి రష్యన్ సేనలు. ఇప్పటి వరకు 15 లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్ ను వీడి వెళ్లారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ఉంటే బాంబు దాడుల్లో చనిపోతామనే ప్రాణభయంతో ఉన్న శరణార్థులు ఉక్రెయిన్ నుంచి ఎక్కువగా మాల్దోవాకు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మాల్దోవా దారులు మూసేస్తుందేమోననే అనుమానంతో మరికొందరు చుట్టుపక్కల దేశాల్లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ దేశ సరిహద్దులన్నీ దాదాపుగా శరణార్థులతో నిండిపోతున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌కు అలెర్ట్

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు