రష్యా పెట్రోలింగ్ బోట్లను పేల్చేసిన ఉక్రెయిన్

రష్యా పెట్రోలింగ్ బోట్లను పేల్చేసిన ఉక్రెయిన్

కీవ్: బ్లాక్ సీలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రష్యాకు చెందిన రెండు బోట్లను ఉక్రెయిన్ సైన్యం పేల్చివేసింది. దానికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ వీడియో ఫుటేజీని ఆ దేశ రక్షణ శాఖ రిలీజ్ చేసింది. మిలటరీ బోటులో భారీ పేలుడు జరిగిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. టర్కీకి చెందిన బైరక్తార్ డ్రోన్లతో దాడి జరిగినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రప్తార్ పెట్రోలింగ్ బోట్లలో ముగ్గురు సిబ్బందితో పాటు 20 మంది ప్రయాణించే వీలుంటుంది. వీటిలో సాధారణంగా మెషిన్ గ‌న్స్ ఉంటాయి. ల్యాండింగ్ ఆపరేషన్స్ కోసం ఈ బోట్లను వాడుతుంటారు. స్నేక్ ఐలాండ్ వద్ద రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైనికులు స‌రెండ‌ర్ అయ్యేందుకు నిరాక‌రించారు. ఈ మ‌ధ్యనే నల్ల సముద్రంలో పార్కింగ్ చేసిన మాస్క్‌వా యుద్ధ నౌక‌ను కూడా పేల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.