సిలబస్ లో లేని ప్రశ్నలు : రోడ్డెక్కిన మెడిసిన్ స్టూడెంట్స్

సిలబస్ లో లేని ప్రశ్నలు : రోడ్డెక్కిన మెడిసిన్ స్టూడెంట్స్

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ భవనం ముందు ఆందోళనకు దిగారు భారత వైద్య విద్యార్థులు. సిలబస్ లో లేని ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో రావడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో 2వేల మంది భారత వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కారు. తాము కష్టపడి చదివాము.. వాళ్ళు సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చి.. మా లైఫ్ తో ఆటలు ఆడుతున్నారని ధర్నాకు దిగారు.

ఈ నెల 24న నిర్వహించిన మెడిసిన్ చివరి సంవత్సరం పరీక్షల్లో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెట్టిన సబ్జక్ట్స్ నుంచి ఒక్క ప్రశ్న కూడా రాకపోవడంతో స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. విద్యార్థులు ఈ పరీక్ష పాసయితేనే, మెడిసిన్ పూర్తయినట్టే. కానీ కావాలనే సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చి, విద్యా సంవత్సరం వృథా అయ్యేలా చేస్తున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ఉక్రెయిన్ ప్రభుత్వం పట్టించుకోలేదని… మాకు జరిగిన ఈ అన్యాయాన్ని సుష్మా స్వరాజ్ కు కూడా ట్వీట్‌ చేశామని విద్యార్థులు చెప్పారు.