యుద్ధంలో ఇప్పటి వరకు 158 మంది చిన్నారుల మృతి

 యుద్ధంలో ఇప్పటి వరకు 158 మంది చిన్నారుల మృతి

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి తెరదించేందుకు ఓ వైపు జోరుగా చర్చలు జరుగుతూ ముందడుగు వేస్తున్నా.. రష్యా మాత్రం వెనుకడుగు వేసినట్లే వేస్తూ క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. మైకొలైవ్ పట్టణంలోని పరిపాలనా భవనంపై గత మంగళవారం రష్యా జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 33కు చేరింది. తమ దళాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతున్న రష్యా వెళుతూ.. వెళుతూ శిధిల భవనాల్లో, చివరకు శవాల మాటున క్లైమోర్ మైన్స్ ను అమరుస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.

సైన్యం తనిఖీలు నిర్వహించి స్వేచ్ఛగా వెళ్లొచ్చు అని ప్రకటించే వరకు ఎవరూ శిధిల భవనాలు, మృతదేహాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ పై గత ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 158 మంది చిన్నారులు చనిపోయారని, మరో 254 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన రష్యాపై నమోదు చేసిన కేసులు వివరాలను వెల్లడించారు.

 

 

 

ఇవి కూడా చదవండి

గవర్నర్ యాదాద్రి పర్యటనకు హాజరుకాని ఈవో

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్ 

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు