రష్యా ఈ నరమేధాన్ని ఆపాలి: పోప్ ప్రాన్సిస్

రష్యా ఈ నరమేధాన్ని ఆపాలి: పోప్ ప్రాన్సిస్

ఉక్రెయిన్ లో నరమేధాన్ని ఆపాలని పోప్ ప్రాన్సిస్ మరోసారి పిలుపునిచ్చారు. రష్యా కాల్పుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలపై బాంబు దాడులు చేసి సాధించేదేం లేదన్నారు పోప్. ఉక్రెయిన్ పై రష్యా ఇవాళ లివివ్ లోని మిలిటిరీ బేస్ పై జరిపిన స్ట్రైక్ లో 35 మంది చనిపోయారు. మరో 130 మందికి పైగా గాయపడ్డారు. మైకోలాయివ్ లో ఎయిర్ స్ట్రైక్ లో తొమ్మిది మంది చనిపోయారు. చెర్నిహివ్ లో రష్యా విసిరిన బాంబు పేలకుండా ఓ అపార్ట్ మెంట్ లో పడిపోయింది. దాన్ని గుర్తించిన స్థానిక బలగాలు జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించాయి. ఘటనలపై పోప్ స్పందించి నరమేధాన్ని ఆపాలంటూ మరోసారి విజ్ఝప్తి చేశారు. 
ఉక్రెయిన్ పై దాడులను నిరసిస్తూ రష్యాలో ప్రజల ర్యాలీ
ఉక్రెయిన్ పై రష్యా దాడులపై సొంత దేశంలోనే జనం వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. రష్యాలోని కొన్ని పట్టణాల్లోప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు.