సంపదను కాపాడుకునే పనిలో అల్ట్రా రిచ్​ పీపుల్

సంపదను కాపాడుకునే పనిలో అల్ట్రా రిచ్​ పీపుల్
  • కమ్యూనిస్టు సర్కారు నిరంకుశ వైఖరితో భవిష్యత్​ పై ఆందోళన
  • జాక్​మా గతే తమకూ పట్టొచ్చనే భయం
  • గతేడాది సింగపూర్​ లో ఏర్పాటైన ఫ్యామిలీ హౌస్​లలో సగం వాళ్లవే

సింగపూర్​ :  చైనాకు చెందిన బిజినెస్​ టైకూన్స్​, అల్ట్రా రిచ్​ పీపుల్​ చూపు.. ఇప్పుడు సింగపూర్​ వైపు ఉంది. కమ్యూనిస్టు ప్రభుత్వం కఠిన వైఖరితో విసిగివేసారిన చైనా కుబేరులు.. తమ సంపదను తరతరాల పాటు నిలిపి ఉంచే సేఫ్​ ప్లేస్​గా సింగపూర్ ను భావిస్తున్నారు. జాక్​ మా వంటి వాళ్లనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన చైనా సర్కారు.. తమ జోలికి మాత్రం రాదని గ్యారంటీ ఏంటని అనుకుంటున్నారు. అందుకే ముందుజాగ్రత్తగా సింగపూర్​కు షిఫ్ట్​ అయిపోతున్నారు. తమ వ్యాపార వ్యవహారాలకు డైరెక్షన్​ ఇచ్చే, సంపదకు గార్డియన్ గా వ్యవహరించే  కీలకమైన ‘ఫ్యామిలీ ఆఫీసు’లను సింగపూర్​ గడ్డపై ఏర్పాటు చేసుకుంటున్నారు.

జాక్​మా కంపెనీలపై సర్కారు తీరు వల్లే.. 

బిజినెస్​ టైకూన్​, అలీ బాబా గ్రూప్​వ్యవస్థాపకుడు జాక్​మాతో చైనా సర్కారు వ్యవహరించిన తీరు.. అక్కడి బిజినెస్​ టైకూన్స్​కు ఫ్యూచర్ పై భయాన్ని పెంచింది. భవిష్యత్తులో ప్రభుత్వం తమతోనూ అలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే..  కష్టపడి కూడబెట్టిన సంపదంతా ఆవిరి అవుతుందనే ఆందోళనను కలిగించింది. దీంతో చైనా బిజినెస్​ టైకూన్స్​ తమ సంపదకు గార్డియన్ గా నిలిచే ఫ్యామిలీ హౌస్​ల ఏర్పాటుపై దృష్టిపెట్టారు.   ప్రపంచంలోని పెద్దపెద్ద కార్పొరేట్​కంపెనీల ఫ్యామిలీ ఆఫీసులు జపాన్​, అమెరికా, ఇంగ్లండ్​, దక్షిణ కొరియా, సింగపూర్​ దేశాల్లో భారీ సంఖ్యలో ఉన్నాయి. అయితే చైనా బిజినెస్​ టైకూన్స్​ సింగపూర్​ వైపే మొగ్గు చూపారు. గత కొన్ని దశాబ్దాలుగా  రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి మారుపేరుగా ఉన్న సింగపూర్​ను తమ వ్యాపారాలకు సంబంధించిన ఫ్యామిలీ హౌస్​లు ఏర్పాటుకు వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఏవైనా విదేశీ వ్యాపార  సంస్థలు   సింగపూర్​లో ​ ఫ్యామిలీ హౌస్​ ఏర్పాటు చేయాలంటే.. కనీసం రూ.15 కోట్లను అక్కడ పెట్టుబడి పెట్టాలి. ఇలా రూ.15  కోట్లు కట్టి 2022 డిసెంబరు నాటికి సింగపూర్​లో 1500 కంపెనీలు ఫ్యామిలీ హౌస్​ లను ఏర్పాటు చేసుకున్నాయి. కిందటేడాది అక్కడ ఏర్పాటైన ప్రతి రెండు ఫ్యామిలీ  హౌస్​లలో ఒకటి చైనా అల్ట్రా రిచ్ పీపుల్స్​కు చెందిందే కావడం గమనార్హం. వారు తమ పిల్లలకు సింగపూర్​లో పర్మినెంట్​ నివాసం ఉండేలా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారట.  చైనా బిజినెస్​ టైకూన్స్​ సింగపూర్​కు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. 

జాక్​మాకు చైనా చేసిన అన్యాయం ఏమిటి ? 

ఈకామర్స్​ రంగంలో వరల్డ్​ ఫేమస్​ ఆలీబాబా గ్రూప్​ అధినేత జాక్​మా గురించి తెలియని వారుండరు. చైనా ఫిన్ టెక్​ కంపెనీ యాంట్​ గ్రూప్​ కూడా అతడిదే. అయితే, చైనా ప్రభుత్వ సంస్థలపై జాక్​మా చేసిన విమర్శలే అతది సంపదలో చాలా భాగం ఆవిరయ్యేందుకు కారణమయ్యాయి. జాక్​మా విమర్శలతో ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆయన వ్యాపారాలను టార్గెట్​ చేసి యాంట్​ గ్రూప్​ పబ్లిక్​ ఇష్యూను ఆపేసింది. చైనా ప్రభుత్వం ఆదేశంతో స్టాక్​ మార్కెట్లో​ యాంట్​గ్రూప్​ లిస్టింగ్​పై షాంఘై, హాంకాంగ్​ స్టాక్​ ఎక్స్ఛేంజీ లు  నిషేధం విధించాయి. దీంతో  జాక్​మా తన సంపదలో  రూ.2 లక్షల కోట్లు (25 బిలియన్​ డాలర్లు) నష్టపోయాడు.  చైనా ప్రభుత్వం కక్షపూరిత వైఖరి నేపథ్యంలో యాంట్​ గ్రూప్​ ను నియంత్రించే అధికారాలను వదులుకునేందుకు జాక్​మా సిద్ధమయ్యారు. కంపెనీ వాటాలను షేర్​ హోల్డర్లకు సర్దుబాటు చేసేందుకు ఆయన అంగీకరించారు. జాక్​మా పరిస్థితే రేపు తమకు కూడా రావచ్చని చైనాలోని మిగతా బిజినెస్​ టైకూన్లు జంకుతున్నారు. అందుకే వాళ్ల చూపు సింగపూర్​ వైపు మళ్లింది. అక్కడ పన్నులు తక్కువగా ఉండటం, కార్మికుల సమ్మెలపై నిషేధం ఉండటం కూడా చైనా కుబేరులు సింగపూర్​కు అట్రాక్ట్ అవుతున్నారు. పెడ్డుబడులు పెట్టాలనే ఆలోచనల్లో పడేస్తోంది. భవిష్యత్తుకు వ్యాపారాలకు బాటలు వేస్తోంది. 

ఫ్యామిలీ హౌస్​ అంటే.. 

ఫ్యామిలీ హౌస్​ అనేది ఒక కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల  పెట్టుబడులు, పన్నులు, సంపద బదిలీ, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. సంపదను సృష్టించడం, దాన్ని కంటికి రెప్పలా కాపాడటమే దీని లక్ష్యం. ఆ వ్యాపార కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులకే దీనిలోని సమాచారంపై యాక్సెస్​ ఉంటుంది. వాళ్ల పర్సనల్​, ఫైనాన్షియల్​ సమాచారం ఇందులో భద్రంగా ఉంటుంది. మన భారతదేశంలోని చాలా కార్పొరేట్​ కంపెనీలు కూడా ఈవిధంగా విదేశాల్లో ఫ్యామిలీ హౌస్​లను కలిగి ఉన్నాయి.