కూకట్ పల్లిలో మోడ్రన్ ట్రాన్స్ పోర్టు

V6 Velugu Posted on Apr 26, 2021

హైదరాబాద్, వెలుగు:  జేఎన్టీయూ, బీహెచ్ఈఎల్, ఐటీ కారిడార్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చేరువలో ఉండడంతో కూకట్ పల్లి స్పీడ్​గా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాన్స్ పోర్టేషన్ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడి నుంచే మోడ్రన్ ట్రాన్స్ పోర్టు నిర్మించేలా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అథారిటీ(ఉమ్టా) చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కూకట్ పల్లికి కిలోమీటరు దూరంలో మియాపూర్ మెట్రో డిపో ఉండగా, తాజాగా మోడ్రన్​ట్రాన్స్​పోర్ట్​సౌలతులను కూడా మొదలు పెట్టనుంది. లాస్ట్ మైల్ కనెక్ట్​విటీలో భాగంగా ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ కలుపుతూ లైట్ ట్రెయిన్లు, బీఆర్టీఎస్ వంటి మోడ్రన్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్స్​ను అందుబాటులోకి తేనుంది.

ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా..

సిటీలో మోడ్రన్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రతిపాదన అమలు ఎప్పటి నుంచో ఉంది. ఉమ్టా రిపోర్ట్ ​ప్రకారమే మెట్రోను నిర్మించారు. దాని సూచనల మేరకే ప్రస్తుతం బీఆర్టీఎస్, లైట్ ట్రాన్స్ పోర్టు ట్రెయిన్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2024 జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ తోపాటు ఎలివేటెడ్ బీఆర్టీఎస్(బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం), లైట్ ట్రైన్ ట్రాన్స్ పోర్టు సిస్టం(ఎల్టీటీఎస్) లను నిర్మించనున్నారు. ట్రాఫిక్​, పొల్యూషన్​ తగ్గించేలా రవాణా సౌకర్యాలను మెరుగుపరుచనున్నారు. ఐటీ కారిడార్ వేగంగా విస్తరిస్తుండడంతో  మోడ్రన్​ట్రాన్స్​పోర్టుపై అధికారులు దృష్టి పెట్టారు.

మియాపూర్​ మెట్రో రాకతో..

మియాపూర్ మెట్రో డిపో రాక ముందే కూకట్ పల్లికి చేరుకునేందుకు సికింద్రాబాద్, ఎంజీబీఎస్ రూట్ల నుంచి బస్సుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎల్​బీనగర్​– మియాపూర్ లైన్ నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మరింత పెరిగాయి. దీంతో కూకట్ పల్లి రూపురేఖలు మారిపోయాయి. రవాణా సౌలతులు పెరిగినట్లుగానే జనాభా కూడా బాచుపల్లి, మియాపూర్, షేక్ పేట్, పటాన్ చెరు వరకు రెసిడెన్షియల్, కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుండగా రవాణా సౌలతుల అవసరం కూడా ఎక్కువైంది.

కూకట్ పల్లి– హైటెక్ సిటీ రూట్​లోనే..

కమర్షియల్, రియల్ ఎస్టేట్, విద్యా రంగాలకు కూకట్ పల్లి కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి, ఐటీ కారిడార్ మధ్య దూరం కేవలం 8 కిలోమీటర్లే. విపరీతంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా  మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హైరైజ్ భవనాలు ఎక్కువగా కూకట్ పల్లి, హైటెక్ సిటీ రూట్​లోనే నిర్మిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించాలంటే ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీ అవసరమవుతుంది. ఆర్టీసీ బస్సుల కంటే ఆల్ట్రా మోడ్రన్ ట్రాన్స్ పోర్టేషన్ ఏర్పాటు చేయాల ని ఉమ్టా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా కూకట్ పల్లి నుంచి ఐటీ కారిడార్ కలుపుతూ బీఆర్టీఎస్, ఎల్టీటీఎస్ నిర్మాణాల అవసరాన్ని గుర్తించింది. సాధ్యాసాధ్యాలపై అధికారులు ఓ దఫా స్టడీ కూడా పూర్తి చేశారు. ఈ రూట్​లో ఉన్న జంక్షన్లు, లింకు రోడ్లు బీఆర్టీఎస్ అవకాశాలను పరిశీలించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రో తరహాలో ఎలివేటెడ్ బీఆర్టీఎస్, లైట్ ట్రైయిన్లకు ఎంతో అనుకూలమని తేల్చింది.

మాస్ ట్రాన్స్ పోర్టేషన్ తోనే పరిష్కారమని..​

తొలి దశ బీఆర్టీఎస్, ఎల్టీటీఎస్ నిర్మాణంతో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్​కు చెక్​పడనుంది. కరోనా కంటే ముందే కేపీహెచ్​బీ నుంచి ఐటీ కారిడార్ రూట్​లో  ప్రతిరోజు16 లక్షల వాహనా లు తిరుగుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ఇంధన వనరుల వాడకం, వాతావరణ కాలుప్యం కూడా పెరుగుతుంది. వీటికి మాస్ ట్రాన్స్ పోర్టేషన్ నే పరిష్కారమని అధికారులు గుర్తించారు. బస్సుల కంటే నిర్వహణ భారం తక్కువగా ఉండే ఆల్ట్రనేటివ్ రవాణా అవసరాలను కూకట్ పల్లి నుంచి నుంచి శంషాబాద్, ఇటు బీహెచ్ఎల్ దాటి ఓఆర్ఆర్ వరకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Tagged Hyderabad, Kukatpally, Umda officials, modern transport

Latest Videos

Subscribe Now

More News