చికెన్​ కొనలేక కోళ్లను కొట్టేస్తున్నరు

చికెన్​ కొనలేక కోళ్లను కొట్టేస్తున్నరు
  • ఖమ్మం జిల్లా వైరాలో ఘటన

వైరా, వెలుగు: చికెన్ ​రేటు కిలో రూ.300కు చేరడంతో కోళ్లు చోరీకి గురవుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలోని చికెన్​షాపులో 7 కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం కోళ్ల చోరీ వీడియో సోషల్​మీడియాలో వైరల్​అవుతోంది. వైరా టౌన్​లోని మెయిన్​రోడ్డు పక్కన వెంకన్న అనే వ్యాపారి చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రోజూలాగే షాపు ముందున్న ఇనుప పంజరంలో కోళ్లను ఉంచి తాళం వేశాడు. అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్​పై వచ్చి తాళాలు పగలగొట్టి ఏడు కోళ్లను ఎత్తుకెళ్లారు. అదంతా షాపు ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్​అయ్యింది. మంగళవారం ఉదయం కోళ్లు కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీ పరిశీలించగా వెంకన్నకు అసలు విషయం తెలిసింది. చికెన్ ధరలు పెరగడంతోనే ఇలా చేస్తున్నారంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. 3 కేజీలు ఉండే ఏడు కోళ్లు చోరీకి గురైనట్లు బాధితుడు వెంకన్న స్థానిక పీఎస్​లో కంప్లైంట్​చేశాడు.