అప్పుల బాధ తాళలేక.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక..   సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య

శామీర్ పేట: తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జీనోంవ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్(35) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 2023లో రూ.6 లక్షల అప్పు తీసుకున్నారు. అందులో ఆ వ్యక్తికి రూ.4.70 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన డబ్బులు చెల్లించాలని అప్పిచ్చిన వ్యక్తి ఒత్తిడి చేయటంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన బాధను ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి పాత ఇనుప సామాను దుకాణంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also read :సిద్దిపేట డీఏవోపై సస్పెన్షన్​ వేటు