చిట్టీ పాట డబ్బులు చెల్లించలేక..

చిట్టీ పాట డబ్బులు చెల్లించలేక..

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి దొడ్డి శంకర్(58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన గత 10 సంవత్సరాలుగా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నారు. చిట్టి పాట పాడిన వ్యక్తులకు సకాలంలో డబ్బులు చెల్లించక పోవడంతో ఒత్తిడి పెరిగింది. చిట్టి పాడిన సభ్యులు డబ్బుకోసం ఒత్తిడి చేయడంతో.. ఇతర చిట్‌ సభ్యులు డబ్బులు చెల్లించిన వెంటనే చిట్టీ పాట డబ్బు చెల్లిస్తానని శంకర్ సర్దిచెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒత్తిడి పెరగడంతో ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన భార్య శంకర్ ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందారు. మృతుడు శంకర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.