టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం

టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

జోగులాంబ గద్వాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని, కేసీఆర్ డైరక్షన్ లోనే సంజయ్ పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. రేవంత్... జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా ? అని సవాల్ చేశారు. మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్నారు. వాళ్లద్దరూ కుమక్కై మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నరని ప్రత్యారోపణలు చేశారు. 

ప్రశాంత్ కిశోర్ (పీకే) సాక్షిగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నయని డీకే ఆరుణ అన్నారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక ఈ కుమ్మక్కు రాజకీయాలకు దిగుతున్నారని డీకే అరుణ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ చేపడుతుతున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు, బండి సంజయ్ యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు. రాళ్లు విసిరి, అలజడి స్రుష్టించి పాదయాత్రను ఆపాలనుకున్న టీఆర్ఎస్ నాయకులు యాత్రకు వస్తున్న స్పందనను చూశాక దిక్కుతోచక అడ్డగోలుగా మాట్లాడుతున్నరని అన్నారు.

వాళ్లు వాడుతున్న భాష, పద్దతిని చూసి జనం ఛీదరించుకుంటున్నరని, కేటీఆర్ వాడుతున్న భాష జుగుప్పాకరంగా ఉందన్నారు. ఎడమ కాలి చెప్పుతో పదవిని తన్నేస్తానని కేటీఆర్ చెబుతున్నారు, ఆ పదవి కోసమే మీరు అడ్డమైన గడ్డి తింటోంది,  వేలాది కోట్లు దోచుకుని ఓట్లను కొనాలనుకుంటున్నది ఎందుకు? అని డీకే అరుణ ప్రశ్నించారు. 

 

ఇవి కూడా చదవండి

మానవత్వం చాటిన బెంజ్ కార్ ఓనర్

కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఝలక్

మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్

6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్