భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్

భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్

గతేడాది కంటే 1.83 మీటర్ల లోతుకు నీళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయి. గతేడాది మే నెలలో రాష్ర్ట సగటు భూగర్భజల మట్టం 12.73 మీటర్లు నమోదు కాగా.. ఈ ఏడాది 1.83 మీటర్లు పడిపోయి 14.56 మీటర్లుగా నమోదైంది. మెదక్‌‌లో అత్యధికంగా 26.47 మీటర్లు, ఖమ్మంలో అత్యల్పంగా 7.55 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉన్నట్టు భూగర్భ జలవనరులశాఖ శనివారం ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నీటి సంవత్సరం(జూన్‌‌–మే)లో రాష్ర్టంలో 17శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం(905.9 మిల్లీ మీటర్లు) కంటే తక్కువగా 748.4 మి.మీ. నమోదైనట్లు వివరించింది.