స్వశక్తితో.. ప్రపంచంలోనే పవర్‌‌ఫుల్‌ ఆర్మీగా..

V6 Velugu Posted on Oct 15, 2021

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టి జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. ఈ కొత్త కంపెనీలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భవిష్యత్ టెక్నాలజీలో కొత్త కంపెనీలు ముందు ఉండాలని సూచించారు. కొత్త కంపెనీలకు స్టార్టప్‌లు సహకరించాలన్నారాయన. స్వదేశీ శక్తిపై భారత రక్షణ రంగం అభివృద్ది చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన అన్నారు.

అంతకు మించి ఎదగాలి..

‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమంలో భాగంగా మన దేశాన్ని సొంత శక్తితో ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ పవర్‌‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఇందులో భాగంగా మన దేశంలోని డిఫెన్స్ పరిశ్రమలు అధునాతనంగా తయారవ్వాలని అన్నారు. మన లక్ష్యం కేవలం ఇతర దేశాలతో సమానం కావడం కాదని, ప్రపంచ దేశాలను లీడ్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. ఇందుకోసం కొత్తగా ఏర్పాటైన ఏడు ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు రీసెర్చ్‌, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ సూచించారు. గడిచిన ఐదేండ్లలో భారత్ నుంచి డిఫెన్స్ ఎగుమతులు 315 శాతం పెరిగాయని, ఇది మరింత పెంచేలా కృషి చేస్తామని అన్నారు. కాగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టడం చారిత్రక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కొత్త కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

జనాభాను నియంత్రణకు ఒక విధానం ఉండాలి: ఆర్‌‌ఎస్‌ఎస్

బిల్‌ క్లింటన్‌కు అస్వస్థత.. భద్రత కోసమే ఐసీయూలో చికిత్స

సాయి ధరమ్ తేజ్‌కు ఇది పునర్జన్మ: మెగా స్టార్

Tagged pm modi, army, Indian military, self-reliant India

Latest Videos

Subscribe Now

More News