బిల్‌ క్లింటన్‌కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

బిల్‌ క్లింటన్‌కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (75) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కాలిఫోర్నియాని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్‌ మెడికల్ సెంటర్‌‌లో చికిత్స పొందుతున్నారు. యూరినరీ ఇన్‌ఫెక్షన్ వచ్చి.. అది రక్తంలోకి ప్రవేశించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటించారు. ఆయన ప్రైవసీ, భద్రత దృష్ట్యా మాత్రమే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామే తప్ప, ఆయన ఆరోగ్యపరంగా ఎటువంటి సీరియస్‌నెస్ లేదని పేర్కొన్నాడు. యూనివర్సిటీ మెడికల్ సెంటర్ చైర్‌‌పర్సన్‌ అల్పెష్ అమిన్ నేతృత్వంలోని  ప్రత్యేక వైద్య బృందం క్లింటన్‌కు చికిత్స అందిస్తోంది.

బిల్‌ క్లింటన్‌కు గుండెపోటు రావడంతో 2004లో బైపాస్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత 2010లో మళ్లీ గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ వల్ల రెండు స్టెంట్లు వేశారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన క్లింటన్‌కు హార్ట్‌కు సంబంధించి ఎటువంటి సమస్య లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనకు కరోనా టెస్టులో కూడా నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆర్కే మృతిపై మావోయిస్టుల లేఖ.. పలువురి సంతాపం

గ‌ద్వాల జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా

ఫిజికల్ టచ్‌లోనే కాదు.. వేరే మార్గాల్లో రొమాన్స్ చూపించొచ్చు: అఖిల్