నిరుద్యోగి మిర్చి బండి

నిరుద్యోగి మిర్చి బండి

రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితిని కళ్లకు కట్టే ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’ ఇది. కరీంనగర్‍కు చెందిన నరసింహ 2019లో డిగ్రీ పూర్తి చేశాడు. కొంతకాలం ఉద్యోగ నోటిఫికేషన్‍ కోసం ఎదురు చూశాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు కావస్తున్నా ఉద్యోగాల నోటిఫికేషన్‍ రాకపోవడం, ఇప్పట్లో వస్తుందన్న ఆశ కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూసి లాభం లేదని.. తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో కరీంనగర్‍లో మిర్చి బండిని ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నాడు.  – కరీంనగర్‍ సిటీ, వెలుగు