పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)లో ఏడాది కాలపరిమితితో భర్తీ చేయనున్న 122 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు పోటెత్తాయి. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిలోని పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. నిమ్స్ హాస్పిటల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సోమవారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో సుమారు 2 వేల మంది అభ్యర్థులు నిమ్స్ క్యాష్ కౌంటర్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు.
వీరితో పాటు ఇతర బ్యాంకుల ద్వారా డీడీలు తీసుకున్న మరికొందరు కూడా దరఖాస్తులు సమర్పించారు. జూన్ 22న విడుదలైన నోటిఫికేషన్‌కు ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా, చివరి రోజైన సోమవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి వేలాది మంది అభ్యర్థులు వచ్చారు.
