హైదరాబాద్ సిటీలో కలకలం. ఓ స్పా సెంటర్ లో బ్యూటీషియన్ గా పని చేస్తున్న భార్యను.. అత్యంత కిరాతకంగా.. స్పా సెంటర్ లోనే చంపేశాడు భర్త. 2026, మే 19వ తేదీ ఉదయం కవాడిగూడలో జరిగిన ఈ దారుణం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగి దేబోరా అనే యువతి కవాడీగూడలోని ఓ స్పా సెంటర్ లో బ్యూటీషియన్ గా పని చేస్తుంది. ఉదయం ఇంట్లో భర్తతో గొడవ జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత మామూలుగానే ఇంటి నుంచి డ్యూటీలో భాగంగా స్పా సెంటర్ కు వచ్చింది దేబోరా.
ఇంట్లో జరిగిన గొడవను మనస్సులో పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత కవాడిగూడలో భార్య పని చేసే స్పా సెంటర్ కు వచ్చాడు. వస్తూ వస్తూ తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. స్పా సెంటర్ కు వచ్చిన భర్త.. భార్యతో గొడవ పడ్డాడు. స్పా సెంటర్ ఉన్న కారిడార్ లోనే భార్య దేబోరాను కత్తితో పొడిచాడు. ఆమె స్పాట్ లోనే చనిపోయింది. ఆ బిల్డింగ్ లో ఉన్న మిగతా వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో క్లూస్ టీంతోపాటు వచ్చారు.
భార్యను హత్య చేసిన తర్వాత భర్త నేరుగా అత్తాపూర్ వెళ్లి.. అక్కడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. భార్యను చంపటానికి కారణాలు ఏంటీ అనేది విచారణ తర్వాత వెల్లడిస్తామన్నారు పోలీసులు.
పట్టపగలు వ్యాపారం జరిగే ఓ బిల్డింగ్ లో ఇలాంటి ఘటన జరగటంపై స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
