రైల్లోంచి జారిపడి ఒకరు మృతి.. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం

 రైల్లోంచి జారిపడి  ఒకరు మృతి..  నల్గొండ జిల్లా చిట్యాల రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం

చిట్యాల,వెలుగు:  రైలులోంచి  జారి కింద పడి ఒకరు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిట్యాల రైల్వే పోలీసులు తెలిపిన మేరకు..  ట్రైన్ లో ప్రయాణిస్తూ గుర్తు తెలియని వ్యక్తి జారి కింద పడి చనిపోయాడు. డెడ్ బాడీ  కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియదు. అతడి వయసు 50 –55 ఏండ్ల మధ్య ఉండి, ఎత్తు 5.5 సెం.మీ, గుండ్రటి ముఖం, నలుపు రంగు, బట్టతల, తెల్ల గడ్డంతో వైట్ కలర్ షర్ట్ ధరించాడు. 

షర్ట్ పై స్వచ్ఛ భారత్ అని రాసి ఉంది. కాళ్లకు శాండిల్స్ ఉన్నాయి. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. నల్లగొండ రైల్వే స్టేషన్ స్టేషన్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ఫిర్యాదుతో ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. రామకృష్ణ కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిస్తే నల్గొండ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫోన్ : 8712658595 లో సమాచారం అందించాలని సూచించారు.