
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఇందిరాపార్క్ లో గంధపు చెట్లను నరికి.. గంధపు చెక్కల్ని పట్టుకుపోతున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. సిటీ నడిబొడ్డున వున్న ఇందిరాపార్కులోనే చెట్లను నిట్టనిలువునా నరికేస్తున్నారు. ఇప్పటివరకూ పార్కులోని 13 గంధపు చెట్లను నరికేశారు. వాటి విలువ లక్షా 60 వేల దాకా వుంటుందని జీహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా అంఛనా వేస్తున్నారు. ఇదంతా ఇంటి దొంగల పనిగా భావిస్తున్నారు. రాత్రి సమయాల్లో వాటిని మిషన్‌లతో కట్ చేసి తీసుకోవడంతో తెలిసిన వారి పనిగా అనుమానిస్తున్నారు. రాత్రికి రాత్రి పార్క్‌లో పెరిగిన గంధపు చెట్లను కట్ చేసి.. పట్టుకెళ్ళడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.