
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు దుండగులు. చేతులు కట్టేసి,గోనసంచిలో కుక్కిబావిలో పడేశారు. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి శివారులోని బోయినిపల్లికి చెందిన సోరపాక వీరమ్మ(70) వ్యక్తిగత పని కోసం ఫిబ్రవరి 19న కాలినడకన గరిమెళ్ళ పల్లికి వెళ్లి అదృశ్యమైంది. వీరమ్మ కోసం బంధువులు, గ్రామస్తులు గాలించారు. అయితే సమీపంలోని ఓ బావిలో దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వీరమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. వృద్ధురాలి ఒంటి పైన ఉన్న బంగారు గొలుసు వెండి కడియాలను దోచుకుని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.