ఆరోగ్య రంగానికి13 శాతం పెరిగిన కేటాయింపులు

ఆరోగ్య రంగానికి13 శాతం పెరిగిన కేటాయింపులు
  • 2047 నాటికి రక్తహీనత నిర్మూలనకు మిషన్
  • రూ.89,155 కోట్ల అలాట్మెంట్​
  • 157 కొత్త నర్సింగ్​ కాలేజీలు 
  • ఐసీఎంఆర్​ ల్యాబ్​లలో ‘ప్రైవేట్​’ రీసెర్చ్​కు రెడ్​ కార్పెట్​

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు 13 శాతం పెరిగాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కిందటేడాది రూ.79,145 కోట్లను కేటాయించగా.. ఈసారి రూ.89,155 కోట్లు కేటాయించారు.  ఈ నిధుల్లో రూ.2,980 కోట్లను హెల్త్​ రిసెర్చ్​ డిపార్ట్మెంట్​ కు అలాట్​ చేశారు. ఈసారి మహిళలపై స్పెషల్​ ఫోకస్​ తో బడ్జెట్​ సాగింది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలను ఇబ్బందిపెడుతున్న సికిల్​ సెల్​ ఎనీమియా (రక్తహీనత)ను  2047లోగా నిర్మూలించేందుకు ప్రత్యేక హెల్త్​ మిషన్​ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో రక్తహీనత ప్రభావం ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లోని 40 ఏళ్లలోపు 7 కోట్ల మందికి స్క్రీనింగ్​ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు. 

102 కోట్ల మందికి 220 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్లు 

దేశంలో మరో 157 కొత్త నర్సింగ్​ కాలేజీలు ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రారంభించిన కొత్త మెడికల్​ కాలేజీల్లోనే వీటి ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. మెడికల్​ డివైజెస్​ వినియోగానికి సంబంధించి ప్రత్యేక కోర్సులను ప్రారంభిస్తామన్నారు. తద్వారా దేశంలో ఆధునిక వైద్య ఉపకరణాలను వినియోగించగలిగే నిపుణుల లభ్యత పెరుగుతుందని చెప్పారు. ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో రీసెర్చ్​ అండ్​ ఇన్నోవేషన్​ను ప్రోత్సహించేందుకు సెంటర్స్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ ద్వారా ఓ కొత్త ప్రోగ్రామ్​ను ప్రారంభిస్తామన్నారు.   ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​(ఐసీఎంఆర్) కు చెందిన లేబొరేటరీల్లో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్​ కాలేజీల ఫ్యాకల్టీ, ప్రైవేటు ఫార్మా కంపెనీల రీసెర్చ్​టీమ్స్​ ప్రయోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిసైడ్​ చేశామన్నారు. ఆర్​అండ్​ డీ విభాగంలో పెట్టుబడులు పెంచేలా ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. 

హెల్త్​ కేర్​..  ప్రయారిటీ హయ్యర్​

2022‌‌‌‌  బడ్జెట్ కేటాయింపు​
రూ.79,145 కోట్లు
2023  బడ్జెట్​ కేటాయింపు 
రూ.89,155 కోట్లు
కేటాయింపుల్లో వృద్ధి 
13శాతం