బడ్జెట్ ఎఫెక్ట్: పెట్రోల్ రేట్లు తగ్గే చాన్స్!

బడ్జెట్ ఎఫెక్ట్: పెట్రోల్ రేట్లు తగ్గే చాన్స్!
  • పెట్రోలియం రిఫైనరీలో వాడే కెమికల్స్‌ సుంకం తగ్గింపు

కేంద్ర బడ్జెట్ వాహనదారులకు చిన్నపాటి గుడ్‌ న్యూస్ అందించింది. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించగా, మరికొన్నింటిపై పెంచారు. ఇందులో భాగంగా మిథనాల్, ఎసిటిక్ యాసిడ్‌తో పాటు పెట్రోలియం రిఫైనరీ ప్రాసెస్‌లో వాడే కెమికల్స్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపారు. దేశంలో సరిపడా నిల్వలు ఉండడంతో సోడియం సైనైడ్‌పై మాత్రం సుంకం పెంచారు. అయితే పెట్రోలియం రిఫైనరీలో వాడే రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల వాటి దిగుమతికి కంపెనీలపై పడే భారం తగ్గుతుంది. తద్వారా కంపెనీలు రిలీఫ్‌ను కస్టమర్లకు అందించాలని నిర్ణయిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఏపీ తెలంగాణ ఒప్పుకుంటే నదుల అనుసంధాన పనులు

మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం గుడ్న్యూస్

కేంద్ర బడ్జెట్ 2022–23లో ప్రధాన అంశాలివే