నీట్‌పై హై లెవల్ కమిషన్.. తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టం: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

నీట్‌పై హై లెవల్ కమిషన్.. తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టం: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ మరియు నెట్ ఎగ్జామ్ నిర్వహణలో జరిగిన తప్పులపై గురువారం ప్రెస్ మీట్ పెట్టారు. అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.  దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని మీడియా ద్వారా ప్రదాన్ కోరాడు. అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందని ప్రధాన్ తెలిపారు. 

ఈ అంశాన్ని విచారించడానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని ఆయన అన్నారు.  విద్యార్థులే మన దేశ భవిష్యత్తు, నీట్ గురించి పుకార్లు వ్యాప్తి చేయవద్దని, వివాదాల పట్ల రాజకీయ దృక్పథాన్ని కలిగి ఉండవద్దని నేను ప్రతి కోరుతున్నానని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

 ఖచ్చితమైన ఆధారాలు లభిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. కొద్ది మంది కారణంగా జరిగిన పొరపాటు పరీక్షకు హాజరైన లక్షలాది విధ్యార్థులపై ప్రభావం చూపకూడదని మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయ్యిందంటూ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఎగ్జామ్స్ రద్దు చేశాలని కోరుతున్నారు. ఇప్పటికే నెట్ ఎగ్జామ్ బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది.