నో చేంజ్..మోదీ పథకాలనే చెప్పిన నిర్మల

నో చేంజ్..మోదీ పథకాలనే చెప్పిన నిర్మల
  • పదేండ్లలో వికసిత్ భారత్ అని వ్యాఖ్య
  •  ఆదాయ పన్ను పరిమితి యథాతథం
  •  2047 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రణాళికలు
  • రూఫ్​ టాప్ సర్వీస్ తో కోటి ఇండ్లకు సోలార్ కరెంటు
  • అంగన్ వాడీలు, ఆశ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్
  • బస్తీలు, అద్దె ఇండ్లలో ఉండే వారికి సొంత గృహాలు
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కంటిన్యూ చేస్తం
  • త్వరలో మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక హౌసింగ్ స్కీం

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేకపోవడం నిరాశ కలిగించింది. పదేండ్ల ప్రగతిని మాత్రమే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి ప్రసంగం సాగింది. ఆదాయపు  పన్ను పరిమితి పెంచుతారని వేతన జీవులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ నిరాశే మిగిలింది. స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. 2047 నాటికి దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పిన నిర్మల.. ప్రధాని నరేంద్ర మోదీ జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని పేర్కొన్నారు. గత ఏడాది ప్రకటించిన  ప్రత్యక్ష పన్నులో స్టాండర్డ్ డిడక్షన్ స్కీం ను పెంపును అమల్లోకి తెస్తామని చెప్పారు. రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి.. మధ్యతరగతి కోంస త్వరలో ప్రత్యేక హౌసింగ్ స్కీంను ప్రవేశపెడతామని తెలిపారు. బస్తీలు, అద్దె ఇండ్లలో ఉండే వారికి గృహయోగం కల్పిస్తామని చెప్పారు. ఈ పథకం కింద 2 కోట్ల ఇండ్లు నిర్మించనున్నట్టు చెప్పారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తింప జేస్తామని వెల్లడించారు. ప్రధాన మంత్రి జన్మన్ యోజన కింద గిరిజనులకు ఉపాధి కల్పించామని తెలిపారు.

నో ఎడ్యుకేషన్ నో హెల్త్

మౌలిక రంగాలపై నిర్మలా సీతారామన్ దృష్టి సారించలేదనే విమర్శలున్నాయి. విద్యా, వైద్య రంగాలకు సాధారణంగా కేటాయింపులు ఉంటాయి. కానీ ఈ సారి బడ్జెట్ లో ఆ వాసనే లేకుండా  పోయిందంటున్నారు విశ్లేషకులు.

పేదలకు 2 కోట్ల ఇండ్లు

రాబోయే ఐదేళ్లలో పట్టణ, గ్రామీణ పేదలకు  2 కోట్ల ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయటానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వీటిని బస్తీల్లోని పేదలు, అద్దె ఇంటిలో ఉండే పేదలకు కేటాయించనున్నట్లు వెల్లడించనున్నారు.  

టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్

టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్ ను అభివృద్ధి చేస్తామని  నిర్మలా సీతారామన్ తెలిపారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్దికి మౌలిక వసతులను పెంచనున్నట్లు చెప్పారు. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు ఇస్తామని వివరించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అయోధ్యలో రామాలయం నిర్మించామని అన్నారు. 

వెయ్యి విమానాలు కొంటం

దేశంలో  పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ కూడా ఇచ్చామని ఆమె తెలిపారు. దేశంలోని  మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తెస్తున్నామని, మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం చేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.