సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లను వదలం

V6 Velugu Posted on May 14, 2022

రంగారెడ్డి: సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు.  తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారుపై అమిత్ షా నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బెంగాల్ లా మార్చాలనుకుంటున్నారని... దాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. 

మజ్లిస్ కు కేసీఆర్ భయపడుతున్నారన్న ఆయన... అందుకే కశ్మీర్ లో 370 ఎత్తేసేందుకు కేసీఆర్ వ్యతిరేకించారని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చినా..చేయడం లేదన్నారు. కేసీఆర్ ను గద్దె దించి.. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సం నిర్వహిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఓవైసీ చేతులో ఉందని, ఇటువంటి ప్రభుత్వాన్ని మార్చేందుకే సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంకా అప్పులు కావాలని అడుగుతున్నారని.. కొడుకు కూతురు లబ్ధి చేకూర్చేందుకేనా ? అని సూటిగా ప్రశ్నించారు షా. ఇంత పనికి రాని అవినీతి ప్రభుత్వాన్ని తానింత వరకు చూడలేదని... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని అమిత్ షా కోరారు.

మరిన్ని వార్తల కోసం...

కేసీఆర్ సర్కార్‌‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలి 

కేసీఆర్ అంటే... కల్వకుంట్ల కమీషన్ రావు

Tagged Bandi Sanjay, CM KCR, KTR , Amit Shah , praja sangrama yathra

Latest Videos

Subscribe Now

More News