అవసమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీములు

అవసమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీములు
  • కిషన్ రెడ్డితో కేంద్రహోం మంత్రి అమిత్​ షా

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ టీములను అందుబాటులో ఉంచామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. అవసరమైతే మరిన్ని టీములను కూడా పంపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అమిత్ షాకు ఫోన్​లో వివరించా రు.

మూసీ నది నీటిమట్టం ప్రమాదకర స్థాయి కి చేరిందని చెప్పారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆయన కోరారు. దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు కిషన్ రెడ్డి వివరించారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని ఆయన కోరారు.