11న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

11న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

హైదరాబాద్, వెలుగు: పార్లమెంటరీ ప్రవాసీ యోజన్ లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 11న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పలువురు కేంద్ర మంత్రులు రెండు, మూడు రోజులపాటు పర్యటిస్తూ ప్రవాసీ యోజన్ లో పాల్గొంటున్నారు. అమిత్ షా కూడా అదే ప్రోగ్రామ్ లో భాగంగా ఒకటి లేదా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పాల్గొననున్న ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అమిత్ షా టూర్,  ఆయన పాల్గొననున్న పార్లమెంట్ నియోజకవర్గాలపై క్లారిటీ రానుందని పార్టీ రాష్ట్ర నేత ఒకరు చెప్పారు.