హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా : శోభాయాత్రపై హై అలర్ట్

హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా : శోభాయాత్రపై హై అలర్ట్

హైదరాబాద్ నగరం గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

సెప్టెంబర్ 6న హైదరాబాద్ నగరంలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షాకు హైదరాబాద్ వస్తున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టులు దిగనున్నారు. ఉదయం 11.30 గంటలనుంచి 12.30 వరకు ITC కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలో సమావేశం కానున్నారు. 

అనంతరం మధ్యాహ్నం 1గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు అమిత్ షా. మధ్యాహ్నం 3.30 కి ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.