కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షా

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షా

రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు సూచించారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ఈరోజు ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎన్డీఏ సర్కారు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలన్నారు. అలాగే మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకల నిర్వహణపై సీఎంలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.