అజయ్ భల్లా పదవీకాలాన్ని మరోసారి పొడిగించిన కేంద్రం

 అజయ్ భల్లా పదవీకాలాన్ని మరోసారి  పొడిగించిన కేంద్రం

కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కె భల్లా సర్వీసును కేంద్రం మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీకాలం ఈ నెలలోనే ముగియనుండగా  ఆయన పదవీకాలన్ని 2024 ఆగస్టు 22 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  1984 అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన అజయ్ భల్లా ..   ఆగస్టు 2019లో హోం సెక్రటరీగా నియమితులయ్యారు. 

2020 నవంబర్‌ నాటికి ఆయన వయస్సు 60 ఏళ్లు దాటడంతో పదవీ విరమణ చేశారు. దీంతో 2020 అక్టోబర్‌ 17న తొలిసారి ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు (2020 ఆగస్టు 22వరకు) కేంద్రం పొడిగించింది. 

అప్పటి నుంచి వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంపొడిగించింది.   హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా నియమించబడక భల్లా గతంలో విద్యుత్‌శాఖ, విదేశీ వాణిజ్యశాఖ డీజీగా సేవలందించారు.