రాహుల్ ఇంకా 1962లోనే జీవిస్తున్నారు :​ అనురాగ్‌‌ ఠాకూర్‌‌

రాహుల్ ఇంకా 1962లోనే జీవిస్తున్నారు :​ అనురాగ్‌‌ ఠాకూర్‌‌

చైనా,‌‌‌‌ పాక్​ కామెంట్స్​పై కేంద్ర మంత్రి​ అనురాగ్‌‌ ఠాకూర్‌‌ ఫైర్​

భోపాల్ : చైనా, పాకిస్తాన్‌‌ దేశాలు ఇండియాపై సంయుక్తంగా దాడి చేయవచ్చని కాంగ్రెస్‌‌ నేత రాహుల్‌‌గాంధీ చేసిన కామెంట్స్​పై కేంద్ర మంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌ సోమవారం ఘాటుగా జవాబిచ్చారు. రాహుల్ ఇప్పటికీ 1962లోనే ఉన్నట్టున్నారని ఫైర్​ అయ్యారు. రాహుల్ గాంధీ ​ఆదివారం మాజీ సైనికులతో మాట్లాడుతూ.. ‘చైనా, పాకిస్తాన్‌‌ ఒక్కటయ్యాయి. యుద్ధం జరిగితే అది ఇద్దరితో ఉంటుంది. ఇండియా ఇప్పుడు చాలా వీక్​గా ఉంది’ అని అన్నారు.

రాహుల్​ కామెంట్స్​పై కేంద్ర మంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌ మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ బహుశా 1962లో ఉన్నట్టున్నారు. ఆర్మీని పదే పదే అవమానించొద్దని రాహుల్‌‌కు చెప్పాలనుకుంటున్నా. కాంగ్రెస్ ఆర్మీ మనోబలాన్ని తగ్గించాలని నిర్ణయించుకుందా లేక రాహుల్ గాంధీకి భారత సైన్యంపై నమ్మకం లేదా?’ అని ఠాకూర్ ప్రశ్నించారు.