
భోపాల్: గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో సాధించలేని అభివృద్ధిని, విజయాలు ప్రధాని మోదీ 8 ఏండ్లలో సాధించారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మిషన్ చంద్రయాన్–3, ఇతర కేంద్ర పథకాల సక్సెస్ను ఉద్దేశించి ఠాకూర్ ఈ కామెంట్స్ చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన తొలి దేశంగా ప్రపంచం లో ఇండియా అగ్రస్థానంలో నిలిచిందన్నా రు. మోదీ ప్రత్యేక ప్రసంగాల బుక్ ‘సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్’ రిలీజ్ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
దేశంలో 4 కోట్ల మంది ప్రజలు పక్కా ఇండ్లు పొందారని, 12 కోట్ల కుటుం బాలకు టాయిలెట్స్ సమకూర్చామని, ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఇచ్చామని తెలిపారు. కరోనా కాలంలో 80 కోట్ల మంది ప్రజలు డబుల్ రేషన్ అందుకున్నట్లు వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 60 కోట్ల మంది ప్రజలు రూ.5లక్షల విలువైన వైద్యచికిత్స ఉచితంగా పొందారని కేంద్ర మంత్రి తెలిపారు.