మీడియా ముందు కేంద్రమంత్రి కన్నీళ్లు

మీడియా ముందు కేంద్రమంత్రి కన్నీళ్లు

కేంద్రమంత్రి అశ్వినీ చౌబే  మీడియా ముందే కంటతడి పెట్టాడు. తన సహచర నేత, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పరశురామ్ చతుర్వేది సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. గత మూడు రోజులుగా చలిలో రైతులకు మద్దతుగా తనతో పాటు నిరాహార దీక్ష చేసిన తమ్ముడు చతుర్వేది గుండెపోటుతో మరణించాడంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి అశ్విని చౌబే .. బక్సర్ లో  24 గంటల్లో తనపై రెండుసార్లు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. రైతు సమస్యలపై బక్సర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో  కొంతమంది గుండాలు కర్రలతో తనపై దాడికి యత్నించగా తన సెక్యూరిటీ ముగ్గురిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారు లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలే జరిగితే ఉన్నతాధికారులకు  ఫిర్యాదు చేశానని..అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.