జెనీవా డబ్ల్యూటీవో సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్

జెనీవా డబ్ల్యూటీవో సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్

12వ మంత్రివర్గ డబ్ల్యూటీవో సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు జెనీవాకు వెళ్లనున్నారు. అక్కడ ‘ బహు పాక్షిక వాణిజ్య వ్యవస్థ... సవాళ్లు’ అనే అంశంపై ఆయన మాట్లడనున్నారు. ఈరోజు కజకిస్థాన్ చైర్‌లో నిర్వహించే రిసెప్షన్‌కు కూడా కేంద్ర మంత్రి హాజరుకానున్నారు. సోమవారం ప్రారంభమయ్యే సదస్సులో ట్రిప్స్  ప్రపోజల్, కరోనా మహమ్మారి తదితర విషయాలను మంత్రి ప్రస్తావించనున్నారు. మంగళవారం ఆహార భద్రత కింద చేపల పెంపకం, వ్యవసాయం గురించి మంత్రి మాట్లాడుతారు. బుధవారం రోజున డబ్ల్యూటీవోసంస్కరణ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్ కోసం కస్టమ్స్ డ్యూటీపై మారటోరియం జారీ అజెండాగా చర్చ జరగనుంది.