ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగులు చేయడం లేదని..ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల నుంచి ఇవ్వడం లేదన్నారు. పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవడం సిగ్గుచేటన్నారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు 

దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నూకలు కొంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని..అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియదన్నారు. రైస్ డిస్ట్రిబ్యూషన్, ప్రొక్యూర్మెంట్ పై  రాష్టాలు, రైస్ మిల్లర్లతో చర్చించినట్లు తెలిపారు.