పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దు

పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దు

ప్రజలంతా కరోనా  జాగ్రత్తలు తప్పనిసరిగా  పాటించాలన్నారు కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి. పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దన్నారు.   పట్నం నుండి  పల్లెలకు వెళ్లేవారు మరింత అలర్ట్ గా  ఉండాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని   చెప్పారు. సికింద్రాబాద్   పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో  పలు అభివృద్ధి  కార్యక్రమాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. గాంధీనగర్ లో  సీసీ రోడ్   నిర్మాణానికి, అశోక్ నగర్ లో  కమ్యూనిటీ హాల్  అదనపు  ఫ్లోర్ నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ముషీరాబాద్   ఎమ్మెల్యే  ముఠా గోపాల్,  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు  లక్ష్మణ్, స్థానిక నేతలు  పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

 

అస్సాంలో బిహూ వేడుకలు