మెహిదీపట్నం, వెలుగు: గుడి మల్కాపూర్ డివిజన్ శారద నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పర్యటించారు. అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో చర్చించారు. అనంతరం శారద నగర్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.