దేశ విభజన..చరిత్రలో చీకటి అధ్యాయం

దేశ విభజన..చరిత్రలో చీకటి అధ్యాయం

న్యూఢిల్లీ, వెలుగు : దేశ విభజన భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని, ఆ సమయంలో సరిహద్దులు దాటి దేశానికి వచ్చే ప్రయత్నంలో జరిగిన మతకలహాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణత్యాగం చేసినవారికు ఆయన నివాళి అర్పించారు. అప్పటి గాయాలను స్మరించుకుంటూనే దేశ సమగ్రత కోసం పనిచేయాలన్న స్ఫూర్తిని యువతలో పెంచేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని కన్నాట్​ప్లేస్ లో మౌన ప్రదర్శన నిర్వహించారు.

‘విభజన విషాద సంస్మరణ దినం’ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మౌన ప్రదర్శనలో కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఐజీఎన్‌‌సీఏ ఆధ్వర్యంలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎమ్ఏ)లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్​ను కిషన్ రెడ్డి ప్రారంభించారు.