తెలంగాణ రాష్ట్రానికి ఏడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్రానికి ఏడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
  • వరద ప్రాంతాల ప్రజలను తరలించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో ఇప్పటికే ఏడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్​ను తెలంగాణకు పంపినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, నిర్మల్ జిల్లాలో ఒకటి, ములుగు జిల్లాలో ఒకటి, హైదరాబాద్‌‌లో ఒకటి, మహబూబాబాద్‌‌లో ఒకటి చొప్పున ఉన్నాయన్నారు. ఈ టీములు స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటాయన్నారు.