సభలో మాట్లాడుతుండగా..స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ

సభలో మాట్లాడుతుండగా..స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ

ముంబై :  కేంద్ర మంత్రి, బీజేపీ నాగపూర్ అభ్యర్థి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మహారాష్ట్రలోని యవత్మాల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఆయన స్పృహ కోల్పోయారు. యవత్మాల్ వాశిమ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రాజశ్రీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కింద పడిపోయారు.

వెంటనే ఆయనను పక్కకు తీసుకెళ్లారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడంతో కాసేపటికి కోలుకున్న గడ్కరీ తిరిగొచ్చి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "మహారాష్ట్ర యవత్మాల్ లో జరిగిన ర్యాలీలో వేడితో నేను అసౌకర్యానికి లోనయ్యాను. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాతి సమావేశానికి హాజరయ్యేందుకు వరుద్‌‌కు బయలుదేరుతున్నాను. ” అని గడ్కరీ పేర్కొన్నారు.