
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ఇలా కాదు.. ఈసారి గట్టిగా.. సొంత పార్టీలోనే పెద్ద చర్చ జరిగేలా కామెంట్స్ చేశారు. ఈ దేశంలో జనాలను ఎవరైతే ఎక్కువ అమాయకులను చేయగలరో వారే గొప్ప నాయకుడు.. అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
సోమవారం (సెప్టెంబర్ 01) నాగపూర్ లో జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన చేసిన చర్చనీయాంశంగా మారాయి. జో లోగోం కో సబ్సే అచ్చా మూర్ఖ్ బనా సక్తా హై.. వహీ సబ్సే అచ్చా నేతా హో సక్తా హే.. అంటూ మరాఠీలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎవరైతే జనాలను ఎక్కువగా ఫూల్స్ చేస్తారో.. వాళ్లే గొప్ప నాయకులు.. అంటూ ఫ్రెష్ కాంట్రవర్సీని క్రియేట్ చేశారు.
ఈజీగా మంచి పనులు చేసుకుంటూ పోవడం కష్టం.. మనస్ఫూర్తిగా నిజాలు మాట్లాడితే ఎవరూ స్వీకరించరు.. ప్రసంసించరు అని అన్నారు. ఎవరి మోటో.. స్వలాభం వారికుంటాయి.. ఏ నాయకుడైతే జనాలను కన్వీన్స్ చేసి ఫూల్స్ ను చేయగలడో అతడే సక్సెస్ అవుతాడని అన్నారు.
ALSO READ : మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సమావేశంతో ఉలిక్కిపడ్డ అమెరికా
ఎంతమందిని ఎంత మోసం చేసి ఎదిగినా.. నిజం అనేదే అల్టిమేట్ అని అన్నారు. గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడని అన్నారు. గెలవడానికి షార్ట్ కట్స్ ఉంటాయి.. రూల్స్ బ్రేక్ చేయొచ్చు.. సిగ్నల్ జంప్ చేయొచ్చు.. కానీ ఒక ఫిలాసఫర్ చెప్పినట్లు.. షార్ట్ కట్స్ కట్ యూ షార్ట్.. అనే కొటేషన్ చెప్పారు.
అద్వానీ వర్గం నేతగా.. మోదీ గ్రూప్ లో ఇమడని నాయకుడిగా నితన్ గడ్కరీ గురించి చెప్తుంటారు. నిజాయితీగా మాట్లాడే నేతల్లో గడ్కరీ ఒకరుగా విపక్షాలు సైతం ఆయనపై గౌరవం ఉంటుంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలను సైతం ఇరుకన పెట్టే వ్యాఖ్యలు పలుమార్లు చేశారు. ఈసారి మరింత ముందుకెళ్లి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.