జూబ్లీహిల్స్ లో సీఎం నివాసంలో.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో రేవంత్ భేటీ

జూబ్లీహిల్స్ లో సీఎం నివాసంలో.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో రేవంత్ భేటీ

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.