సోలార్‌ పంపుల ఏర్పాటుకు స్కీం: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌

సోలార్‌ పంపుల ఏర్పాటుకు స్కీం: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌

రైతులకు ఉచితంగా సోలార్‌‌‌‌ పంపులు, ప్యానళ్లు ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌‌‌‌ స్పష్టం చేశారు. దానికి బదులుగా.. వాటికి అయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి 30 శాతం భరించే విధంగా స్కీం ప్రవేశపెడతామన్నారు. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిందని, త్వరలోనే దాన్ని అమలు చేస్తామని మంగళవారం రాజ్యసభలో చెప్పారు.

హోమియోపతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సెంట్రల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ హోమియోపతి (సీసీహెచ్‌‌‌‌) పునర్నిర్మాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరం ఉన్న టెన్యూర్‌‌‌‌‌‌‌‌ను రెండేళ్లకు పొడిగించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. లోక్‌‌‌‌సభ గతవారమే ఈ బిల్లును ఆమోదించింది.

రాజ్యసభలో 15ఏళ్ల రికార్డు బ్రేక్‌‌‌‌
రాజ్యసభలో క్వశ్చన్‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌లో సభ్యులు అడిగిన స్టేర్డ్‌‌‌‌ (స్టార్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌) ప్రశ్నలన్నింటినీ పూర్తి చేసినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సభ్యులు అభినందించారు. 2018 జనవరి 2న అన్నీ స్టేర్డ్‌‌‌‌ క్వశ్చన్స్‌‌‌‌ పూర్తయ్యాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత అది సాధ్యమైందని రాజ్యసభ సెక్రటేరియట్‌‌‌‌ చెప్పింది. 2002లో 197వ సెషన్‌‌‌‌లో నమోదైన రికార్డును బ్రేక్‌‌‌‌ చేశారని అధికారులు చెప్పారు.

160 మంది ఐఎస్‌‌‌‌ సభ్యుల అరెస్టు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇస్లామిక్‌‌‌‌ స్టేట్‌‌‌‌ (ఐఎస్‌‌‌‌)కు చెందిన 160 మంది టెర్రరిస్టులు, టెర్రరిస్టు సానుభూతి పరులను  పోలీసులు, ఎన్‌‌‌‌ఐఏ అదుపులోకి తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి చెప్పారు. మంగళవారం లోక్‌‌‌‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. టెర్రరిజాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు, నేషనల్‌‌‌‌ ఆర్గనేజేషన్లు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో, రిజల్ట్‌‌‌‌ తర్వాత పశ్చిమ బెంగాల్‌‌‌‌లో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందని, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపామని కిషన్‌‌‌‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అడ్వైజరీ ఇష్యూ చేనినట్లు చెప్పారు.

ప్యాక్డ్‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌లోని మైక్రో ప్లాస్టిక్‌‌‌‌ సేఫ్‌‌‌‌
వాటర్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌కు ఉపయోగించే మైక్రో ప్లాస్టిక్‌‌‌‌ సేఫ్‌‌‌‌ అని హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ హర్ష వర్దన్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ రాజ్యసభలో చెప్పారు. ఫుడ్‌‌‌‌ సేఫ్టీ అండ్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ అథారిటీకి చెందిన సైంటిఫిక్‌‌‌‌ ప్యానల్‌‌‌‌  దీనిపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని వెల్లడించిందని మంత్రి అన్నారు. మైక్రో ప్లాస్టిక్‌‌‌‌ బరువు 0.01 ఎంజీ / కేజీ ఉందని, అందుకే అది సేఫ్‌‌‌‌ అని అన్నారు.

ఏఎస్‌‌ఐ వెయ్యి ఆలయాలను కాపాడుతోంది
దేశవ్యాప్తంగా ఉన్న 1,081 ఆలయాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌‌ ఇండియా(ఏఎస్ఐ) సంరక్షిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌‌ పటేల్‌‌ చెప్పారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ మేరకు కర్నాటకలో 242, యూపీలో 132, తమిళనాడులో 120, మధ్యప్రదేశ్‌‌లో 96 టెంపుళ్లను ఏఎస్‌‌ఐ పరిరక్షిస్తోందని చెప్పారు.