ఈ తాతయ్య.. స్ఫూర్తినిచ్చే హీరో: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

ఈ తాతయ్య.. స్ఫూర్తినిచ్చే హీరో: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ముంబై సిటీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారామె. అక్కడే ఓటు వేసేందుకు వచ్చిన ఖన్నా అనే తాతయ్యపై ఆమె ప్రశంసలు కురిపించారు.

93 ఏళ్ల ఆర్మీ మ్యాన్

‘‘ఖన్నాజీ ఇవాళ్టి హీరో. ఆర్మీలో సైనికుడిగా సేవలందించారు. ఇప్పుడాయన వయసు 93 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన ఓటు వేసేందుకు వచ్చారు. ఇది మనందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజలంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నా. 93 ఏళ్ల వయసులో ఖన్నాజీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు.. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? అందరూ పోలింగ్ కేంద్రాలకు రండి’’ అని పిలుపునిచ్చారు స్మృతి ఇరానీ.

మహారాష్ట్రలో ఉదయం నుంచి కూడా చాలా నెమ్మదిగా ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 18 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. దీంతో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.

మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కొంచెం వేగం పుంజుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 43.7 శాతం ఓట్లు పోలయ్యాయని ఈసీ తెలిపింది.