అమేథీ అభివృద్ధిని 15 ఏండ్లు విస్మరించిన్రు: స్మృతి ఇరానీ

అమేథీ అభివృద్ధిని 15 ఏండ్లు విస్మరించిన్రు: స్మృతి ఇరానీ

అమేథీ: ఉత్తరప్రదేశ్​లోని అమేథీ నియోజకవర్గ అభివృద్ధిని పదిహేనేండ్లుగా కాంగ్రెస్ పార్టీ, ఎంపీ రాహుల్ గాంధీ విస్మరించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఇక్కడి నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల వేళ శుక్రవారం తన నివాసంలో యాదవ కమ్యూనిటీ ప్రజలతో ఆమె మాట్లాడారు. 

గాంధీ కుటుంబం, ముఖ్యంగా రాహుల్ గాంధీ అమేథీ ప్రజలు పేదలుగానే మిగిలిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఒక పేదవాడి కొడుకు అయిన మోదీ పేదరికాన్ని ఎదుర్కొని, కృషి, అంకితభావం, నిజాయితీతో పాటు అందరి దీవెనలతో దేశానికి ప్రధాన సేవకుడిగా మారితే కాంగ్రెస్ గానీ, గాంధీ కుటుంబం గానీ జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, నియోజకవర్గంలో ఎంపీగా రాహుల్ ఉన్నప్పుడు కూడా ఆయన అమేథి అభివృద్ధి గురించి ఆలోచించలేదని ఆరోపించారు.