కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కాటక్ అన్నారు. గంగాధర రైల్వే స్టేషన్  రోడ్డు జీవీఆర్ గార్డెన్ లో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్తకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, యువతను పట్టించుకోవడంలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, రాష్ట్ర ప్రజలు కూడా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.